సీజనల్ వ్యాధుల నివారణ, శానిటేషన్, హరితహారంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధుల నివారణ నియంత్రణపై జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించింది. వచ్చేది వర్షాకాలం అయినందున కీటక జనిత వ్యాధులు, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు.
గ్రామాలు, పట్టణాల్లోని మురికి కాలువల్లో పూడిక వెంటనే తీసివేయాలని, అదే విధంగా నీరు నిల్వ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంచి నీటిని సరఫరా చేసే పైపుల్లో ఏమైనా లీకేజీలు ఉంటే వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. సమయానుసారంగా తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, వైద్య సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొనాలని తెలిపారు.
ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్