నిర్మల్ జిల్లా ముజిగిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆడపడుచులకు కానుకగా.. బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముజిగి గ్రామంలో రామాలయానికి రూ.50 లక్షలు, మల్లన్న గుడికి రూ.50 లక్షల నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజమని మల్లేశ్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీ కో- ఆప్షన్ సుభాశ్ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: వైరల్: స్కార్పియో తలుపుల్ని ఢీకొని బైకర్ మృతి