ETV Bharat / state

మంత్రి అక్షరభ్యాసం - దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని  మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తున్న మంత్రి
author img

By

Published : Feb 28, 2019, 11:44 AM IST

Updated : Feb 28, 2019, 12:15 PM IST

రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్​ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతోమంత్రి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.
దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా
అమ్మవారి కృపతో మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ. 50 కోట్లతో రెండేళ్లలోపు పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ఆలయ పరిసరాలను పచ్చదనంతో సుదరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్​ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతోమంత్రి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.
దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా
అమ్మవారి కృపతో మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ. 50 కోట్లతో రెండేళ్లలోపు పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ఆలయ పరిసరాలను పచ్చదనంతో సుదరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి

Intro:TG_WGL_28_27_SOLAR_VIDYUTTHU_THO_CELL_PHONE_CHARGING_PKG_G1
.............................
సాంకేతికత పై మక్కువ.... శాస్త్రవేత్త కావాలని దృక్పథం లక్ష్యసాధనకు నిరంతరం శ్రమిస్తున్న ఆ యువకుడి మదిలో సరికొత్త ఆలోచన తట్టింది. మారుమూల పల్లె నుంచి పట్నం దాకా అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం విరివిగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్ చార్జింగ్ కోసం విద్యుత్ అందుబాటులో లేని సమయంలో పవర్ బ్యాంకు ల వినియోగం పెరిగిపోతుంది . పవర్ బ్యాంకు చార్జింగ్ చేసుకునేందుకు విద్యుత్ అందుబాటులో లేకుంటే ఎలా..? సోలార్ పవర్ బ్యాంకు రూపొందించాలనే తపన అతడి మదిలో కదలాడింది. వెంటనే తన మెదడుకు పదును పెట్టాడు . అందుబాటులో ఉన్న వస్తువులతో సోలార్ పవర్ బ్యాంకు రూపొందించి ఔరా అనిపించుకుంటున్నాడీ యువకుడు. అతనే గునిగంటి శ్రీకాంత్......
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజు పల్లి గ్రామానికి చెందిన గునిగంటి వెంకన్న రామక్క దంపతుల కుమారుడు శ్రీకాంత్. ఇతను ఖమ్మం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. కళాశాల నుంచి ఇంటికి వచ్చాక ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేపట్టాలనే తపనతో అనునిత్యం వివిధ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోలార్ పవర్ బ్యాంకు రూపొందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది. అందుకనుగుణంగా ప్రయత్నాన్ని కొనసాగించి విజయం సాధించాడు. అందుబాటులో ఉన్న వస్తువులతో సోలార్ పవర్ బ్యాంకు రూపొందించాడు. సెల్ ఫోన్ లో వినియోగించే బ్యాటరీలు, పాత సెల్ ఫోన్ లోని పీ సి బీ లు, ఎలక్ట్రానిక్ డయోడ్లు సోలార్ చార్జింగ్ లైట్ లోని ప్యానెల్స్ తీసుకుని వాటిని అనుసంధానం చేసి పవర్ బ్యాంకు ను రూపొందించాడు . దీనిని కేవలం 1000 రూపాయల వ్యయంతో తయారుచేశాడు. ఈ కొత్త పవర్ బ్యాంకు ద్వారా సూర్యరశ్మిని వినియోగించి 6000 ఎంఎ హెచ్ బ్యాటరీ చార్జింగ్ చేసే పరికరాన్ని ఆవిష్కరించాడు .ఈ పరికరాన్ని ఐదు గంటలపాటు ఎండలో పెట్టినట్లయితే ఛార్జింగ్ అవుతుంది. చార్జింగ్ అయ్యే సమయాల్లో లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశాడు. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ చేసుకునేలా యూఎస్ బీ లను ఏర్పాటు చేశాడు .చార్జింగ్ అయిన పవర్ బ్యాంకు తో సెల్ ఫోను ను మూడుసార్లు చార్జింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుందని ఆ యువకుడు నిరూపించాడు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవారు చార్జింగ్ అయిపోగానే ఎండలో నిలబడి దీని ద్వారా తిరిగి చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని విద్యుత్ సదుపాయం లేని ప్రదేశాల్లో, దేశ సరిహద్దుల్లో ని సైనికులకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఈ యువకుడు అభిప్రాయపడుతున్నారు.
* పేద కుటుంబానికి చెందిన తనకు ఆర్థిక స్థోమత లేని కారణంగా సాంకేతిక విద్యను అభ్యసించ లేని పరిస్థితి నెలకొందని యువకుడు విచారం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో సూర్యరశ్మిని వినియోగించి పవర్ బ్యాంకు ను తయారు చేసేందుకు సెల్ఫోన్ కంపెనీలు, ప్రభుత్వం తనను ప్రోత్సహించినట్లయితే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని చెబుతున్నాడీ యువకుడు.
గతంలో ఇంటి వద్దనే ఉండి రైతులు వ్యవసాయ భూముల వద్దకు వెళ్లకుండా సెల్ ఫోన్ తోనే విద్యుత్ స్టార్టర్ ఆన్ అవడం....నడిచే మోటారుని అనంతరం ఇంటి నుంచి దానిని బందు చేసేలా నూతన పరికరాన్ని సైతం సృష్టించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నాడు. విద్యార్థి దశలోనే సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు జీవితంలో మరిన్ని సాంకేతిక అద్భుతాలు సృష్టించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.
బైట్.....
1.గునిగంటి శ్రీకాంత్, యూవకుడు, గుండంరాజు పల్లి


Body:సోలార్ పవర్ బ్యాంకు తయారీ


Conclusion:8008574820
Last Updated : Feb 28, 2019, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.