రాబోయే కాలంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. నియతృత్వ పాలనకు హుజూరాబాద్ గడ్డ ఘోరి కడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజానీకం హుజూరాబాద్ వైపు చూస్తోందని తెలిపారు. నిర్మల్లో భాజపా తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొని... ప్రసంగించారు.
హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. దీన్ని ఆపగలిగే సత్తా కేసీఆర్కు కాదూ కాదా ఆయన జేజేమ్మకు కూడా లేదు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వామ్యులు కావాలి.
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి
ఇదీ చదవండి: Petrol GST news: అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.56, డీజిల్ రూ.50!