ETV Bharat / state

పులి క్షేత్రంలో అక్రమార్కుల దందా - కవ్వాల్​ పులుల సంరక్షణ కేంద్రం

చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల సంచారం, క్రూరమృగాల ఆనవాళ్లతో చూపరులను కట్టిపడేసే మనోహర దృశ్యాలతో కనువిందు చేసే కవ్వాల్‌ అభయారణ్యాన్ని ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రం (టైగర్‌ జోన్‌)గా ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిచేసి వన్యప్రాణులను రక్షిస్తూ... జీవవైవిధ్యాన్ని కాపాడాలని సంకల్పించింది. సర్కారు ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణలో చిత్తశుద్ధి కొరవడుతోంది. ఫలితంగా అక్రమార్కుల కారణంగా విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. జంతుజాలం, జీవరాశుల ఉనికే ప్రమాదకరంగా మారింది.

అక్రమంగా అడవుల నరికివేత
author img

By

Published : Jul 15, 2019, 9:58 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892 చ.కి.మీ. కోర్‌ ప్రాంతంగా, 1,123 చ.కి.మీ. బఫర్‌ ప్రాంతంగా అధికారులు గుర్తించారు. 16 మండలాల్లోని అటవీ ప్రాంతం ఈ కేంద్రంలోకి వస్తుంది. అటవీ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ గట్టిగా చర్యలు చేపట్టాల్సి ఉండగా కార్యాచరణ అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు విలువైన కలపను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. వీరికి అటవీశాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమాయకులకు ఆశలు కల్పించి..

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న విలువైన కలప సంపదపై అక్రమార్కులు కన్నేశారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఎత్తుగడలతో అక్రమాలకు పాల్పడడంలో దిట్టలుగా నిలుస్తున్న కలప స్మగ్లర్లు అటవీ హక్కు చట్టం చాటున అమాయకులను మభ్యపెడుతున్నారు. మీరు చెట్లు కొట్టుకోండి! మీ కష్టానికి మేము కూలీ చెల్లిస్తాం. కలప మేం తీసుకుంటాం. వ్యవసాయం చేసుకోవడానికి మీకు భూమి దక్కుతుంది. దాన్ని మీరు దున్నుకోండని నమ్మిస్తున్నారు. ఇస్లాంపూర్‌, పాండ్వాపూర్‌, బిర్సాయిపేట, బలాన్‌పూర్‌ అటవీ ప్రాంతాల్లోని విలువైన వనాలను నరికి వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను తరలించుకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పట్టుబడినా అక్రమ వ్యాపారాన్ని మాత్రం కొనసాగించడం గమన్హారం.

అటవీ హక్కు చట్టం సాకుతో...

వలస వచ్చి తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాలని 2005లో అటవీ హక్కు చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారం 13, డిసెంబరు-2005కు పూర్వం నుంచి అటవీ భూములను సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాల్సిఉంది. ఆ చట్టం ప్రకారం ఇప్పటివరకు ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో లక్షా ముప్పైవేల ఎకరాల అటవీ భూములకు సంబంధించి 37,182 మంది రైతులకు హక్కుపత్రాలు ఇచ్చారు. అయితే ఆ చట్టాన్ని సాకుగా చేసుకొని కొందరు ఇతర ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతానికి వలస వచ్చి ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా అడవిలోని వృక్షాలను నరికి వేస్తున్నారు.

పీడీయాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు...

అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. స్మగ్లర్లపై పీడీయాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. అటవీ హక్కుపత్రాలు వస్తాయని అడవులను ఎవరు కొట్టినా నేరమేనని వివరించారు. సాధ్యమైనంత త్వరగా అటవీ ప్రాంతంలోని రాంపూర్​, మైసంపేట గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : చినుకు పడితే చిత్తడే!

Intro:స్థానాలు చేయడానికి నీళ్లు గదులు లేక ఇబ్బందులు పడుతున్న మహిళలు:

యాంకర్ పార్టు: సూర్యాపేట జిల్లా పాలకొల్లు మండలం లోని జాన్పహాడ్ దర్గా దగ్గర కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు మరీ ముఖ్యంగా తాగడానికి మంచినీరు స్థానాలు చేయడానికి గదులు లేక ఇబ్బంది పడుతున్న మహిళలు ఇక్కడ అ దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని అభివృద్ధి ఏమీ జరగడం లేదని తెలంగాణ కోర్టు పేరుకే ఉంది తప్ప వీటిని అరికట్టలేకపోతోంది అని స్థానికులు వాపోతున్నారు

వాయిస్ ఓవర్: జాన్పహాడ్ దర్గా దోపిడీదారులకు దౌర్జన్యానికి అరాచకాలకు నిలయంగా మారింది కొంతమంది గుత్తేదారులు ప్రతి సంవత్సరం వేలంపాట కార్యక్రమంలో పాల్గొని సుమారు కోటి రూపాయలు పాట పాడి అభివృద్ధి చేయకుండా దోపిడీలకు అరాచకాలకు అవినీతికి పాల్పడుతున్నారని స్థానికులు అంటున్నారు ప్రతి సంవత్సరం హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త వేలం పాట పాడి వారి అనుచరులను దర్గా దగ్గర ఉంచి వెళ్తారు వీరు నాలుగు గ్రూపులుగా చేరి వచ్చిన భక్తుల దగ్గర అందినకాడికి దోచుకుంటున్నారు రు లోపలికి వెళ్లడానికి ఒక్కొక్కరి టికెట్ ధర 20 రూపాయలు కేటాయించారు రెండు లడ్డూ ధర 50 రూపాయలు కేటాయించారు ఇక్కడ ముస్లిమ్స్ లో ముస్లింలు alalu చేస్తే 500 రూపాయలు దాక తీసుకుంటున్నారు ప్రసాదం సమర్పించేటప్పుడు మరో 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు బోర్డు వాళ్ళు వంటలు వండుకో డానికి షెడ్లు నిర్మాణం జరగలేదు ప్రదర్శనలు చేసేటప్పుడు నీడ లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సంవత్సరం వేలం పాట పాడిన పాటలు సుమారు 20 లక్షల రూపాయలు తెలంగాణ బోర్డ్ కేటాయించారని స్థానికులు తెలిపారు వీటి ద్వారా అయినా స్థానాల గదులు మంచినీళ్ల సౌకర్యం వండుకోవడానికి షెడ్ల నిర్మాణం కూడా నిర్మించలేదని తెలిపారు ముఖ్యమైన విషయం ఏమిటంటే బెల్టుషాపులు విచ్చలవిడిగా తయారయ్యాయి ఉన్న ధర మీద 50 నుంచి 60 రూపాయలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు దేవాలయాల దగ్గర దర్గా దగ్గర మద్యం షాపులు ఉండకూడదని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ దర్గా అభివృద్ధి చెందాలంటే వేలంపాట కార్యక్రమాన్ని రద్దు చేయాలని స్థానికులు తెలుపుతున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వేలంపాట రద్దవుతుంది మళ్లీ వేలంపాట కార్యక్రమం నిర్వహిస్తే సహించేది లేదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

బైట్1: శేషు జాన్పహాడ్ గ్రామస్తుల

బైట్2: జానయ్య భక్తుడు

బైట్3: అంజిరెడ్డి నరసరావుపేట

బైట్4: నవీన్ కుమార్ జాన్పహాడ్ గ్రామస్తులు

END: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోని దర్గాని అభివృద్ధి చేయాలని దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలను అరికట్టాలని వచ్చిన భక్తులు స్థానికులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్

సెంటర్ huzurnagar

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.