ETV Bharat / state

'కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు' - నిర్మల్​లో బండి సంజయ్ పాదయాత్ర

Bandi Sanjay fires on CM KCR Speech: పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడారని బండి సంజయ్‌ విమర్శించారు. కూతురు కవితను మద్యం కేసులో తప్పించడంపైనే కేసీఆర్‌ ఆలోచన ఉందని ఎద్దేవా చేశారు. అందుకే మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Dec 4, 2022, 10:36 PM IST

Updated : Dec 4, 2022, 10:45 PM IST

Bandi Sanjay fires on CM KCR Speech: సీఎం కేసీఆర్​ మహబూబ్​నగర్​ బహిరంగసభలో మాట్లాడిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సాయంత్రం పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బండి సంజయ్‌ విమర్శించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవని కేసీఆర్‌ చెప్పటం అవాస్తవమని పేర్కొన్నారు. తమతో కలిసి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తారా అని ప్రశ్నించారు. సాయంత్రం నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కుమార్తె కవితను మద్యం కేసు నుంచి తప్పించడమే కేసీఆర్‌ ఆలోచన అని ఎద్దేవా చేశారు. అందుకే మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని బండి ఆరోపించారు. కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వమని.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరన్నారు. తెలంగాణలో గడీల పాలనను అంతం చేయడానికే భాజపా ప్రజల ముందుకొచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు'

'పాలమూరు సభలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవనటం అవాస్తవం. పాలమూరు జిల్లాలో మాతో కలిసి సీఎం పర్యటిస్తారా? కవితను మద్యం కేసులో తప్పించడంపైనే కేసీఆర్ ఆలోచన. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు కేసీఆర్. కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వం కేసీఆర్‌ నిన్ను ఎవరూ కాపాడలేరు.'-బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నిర్మల్‌ జిల్లాలో బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏడో రోజు ఉత్సాహంగా సాగింది. నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంగపేట్‌, ఈద్గావ్‌ క్రాస్‌ రోడ్స్‌, శివాజీ చౌక్‌, శాంతినగర్‌ పీవీ విగ్రహం, కండ్లి వరకు 11.5 కి.మీ మేర సాగింది. భాజపా శ్రేణులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. చిట్యాల బ్రిడ్జి వద్ద మాజీ కౌన్సిలర్‌ నూతుల భూపతిరెడ్డి స్వర్ణవాగులు తెప్పపై నిల్చుని బండి సంజయ్‌ యాత్రకు స్వాగతం పలికారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.