డా. బీఆర్ అంబేడ్కర్.. దేశం గర్వించదగ్గ వ్యక్తి అని ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొనియాడారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని చిల్డ్రన్ పార్క్లో.. బాబాసాహెబ్ 130వ జయంతిని ఘనంగా జరిపారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.. సునీతా లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ..ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నేతలతో పాటు.. తెరాస శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: సెల్ఫీ వీడియో: గొలుసుకట్టు మోసంతో ఆత్మహత్యాయత్నం