ETV Bharat / state

పెద్ద పులుల డెన్​ కవ్వాల్​ నుంచి గ్రామాల తరలింపు

పెద్దపులుల డెన్​ కవ్వాల్​ నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. మంచిర్యాల జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్​ గ్రామాలు తరలించే అటవీ ప్రాంతాల్ని డీనోటిఫై చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సలహా మండలి గతేడాదే ఆమోదం తెలిపింది.

The villages were evacuated from kawal in mancherial district
పెద్ద పులుల డెన్​ కవ్వాల్​ నుంచి గ్రామాల తరలింపు
author img

By

Published : Feb 1, 2020, 10:21 AM IST

కవ్వాల్‌ పెద్దపులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. మంచిర్యాల జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను తరలించే అటవీ ప్రాంతాల్ని డీనోటిఫై చేయనున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సలహా మండలి గతేడాదే దీనికి ఆమోదం తెలిపింది. నేడు హైదరాబాద్‌లో జరిగే ‘తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి మండలి’ తొలి సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే వన్యప్రాణి సంరక్షణ మండలి కొత్త కమిటీ డిసెంబరు 18న ఏర్పాటైంది.

వన్యప్రాణి ప్రాంతాలు, రక్షిత అటవీప్రాంతం చుట్టూ ఉండే సున్నిత ప్రాంతాల పరిధిలో చేపట్టే మరికొన్ని ప్రాజెక్టులకు అటవీ భూముల బదలాయింపుపైనా మండలి నిర్ణయం తీసుకోనుంది.

అదే మండలంలో మరోచోట

కవ్వాల్‌ ప్రాంతాన్ని పెద్దపులులకు ఆవాసంగా మార్చేందుకు కోర్‌ఏరియాలో 20కిపైగా గ్రామాల్ని తరలించాలని గతంలో నిర్ణయించిన అటవీశాఖ..ఆయాగ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రయోగాత్మకంగా మైసంపేట, రాంపూర్‌ గ్రామస్థులతో మాట్లాడి ఒప్పించింది. 142 గిరిజన కుటుంబాల్ని తరలించనున్నారు. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్టీసీఏ) నుంచి నిధులు విడుదలయ్యాయి. వీరిని కడెం మండలంలోని పెద్దూరుకు తరలించాలని నిర్ణయించిన అటవీశాఖ..112 హెక్టార్ల ప్రాంతాన్ని గుర్తించింది. దీన్ని నివాసప్రాంతంగా చేయాలంటే అటవీభూమిని డీనోటిఫై చేయాలి.

కొన్నినెలలుగా రాష్ట్ర వన్యప్రాణి మండలి లేకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఏర్పడడంతో ఈ అంశం కొలిక్కి వచ్చినట్లైంది. ఇక్కడ ఆమోదం తర్వాత కేంద్ర వన్యప్రాణి మండలికి సిఫార్సు చేయనున్నారు. అయితే గ్రామాల్ని తరలించే ప్రాంతాల్ని డీనోటిఫై చేసేందుకు మండలి ఆమోదం అవసరం లేదని..తరలించే ప్రాంతం టైగర్‌ రిజర్వుకు అవతల ఉంటుందని వన్యప్రాణి సంరక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. రెండుగ్రామాల్ని తరలించే ప్రాంతం కడెం మండలంలోనే ఉందని, ఇది టైగర్‌ రిజర్వు పరిధిలోకి వస్తున్నందున మండలి ఆమోదం అవసరమేనని ఓ అటవీ అధికారి అభిప్రాయపడ్డారు.

షరతులతో మరికొన్ని ప్రాజెక్టులకు

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు కాగజ్‌నగర్‌ డివిజన్‌లో రైల్వే 3వలైన్‌కు, కవ్వాల్‌-తడోబా టైగర్‌కారిడార్‌లో విద్యుత్‌లైన్‌కు, వరంగల్‌ డివిజన్‌లో ఉరత్తం-ఐలాపూర్‌ రోడ్డు, గోదావరిపై బ్యారేజీల నిర్మాణం, రాష్ట్ర, కేంద్ర వన్యప్రాణి మండళ్ల ఆమోదం అవసరమైన కేటగిరీ-1లోని 10 ప్రాజెక్టులు..వాటికి రెండొందల పైచిలుకు హెక్టార్ల అటవీభూముల బదలాయింపుపై వన్యప్రాణి మండలి చర్చించనుంది. ఈ ప్రాజెక్టులకు అటవీభూముల తరలింపునకు అటవీశాఖ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ అంగీకరించి కొన్ని షరతులు పెట్టారు.

అటవీభూమికి ప్రత్యామ్నాయంగా భూముల్ని కేటాయించడంతోపాటు వన్యప్రాణులకు ఇబ్బందులు తగ్గించే చర్యలకు రూ.8.03కోట్లు డిపాజిట్‌ చేయాలని, ఆయాప్రాంతాల్లో గడ్డిభూములు పెంచాలని, సోలార్‌ బోర్‌వెల్స్‌ తవ్వించాలని, రోడ్లు వచ్చేచోట అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిపై వన్యప్రాణి మండలి నిర్ణయం తీసుకోనుంది. కేటగిరి 2, 3లో మరో 13 ప్రాజెక్టులున్నాయి. ఇందులో హైదరాబాద్‌ కేబీఆర్‌ నేషనల్‌పార్కు ఎకోసెన్సిటివ్‌ జోన్‌లో ఓ స్థిరాస్తి సంస్థ 4.32 హెక్టార్లలో నిర్మించే వాణిజ్య భవనాల ప్రాజెక్టులున్నాయి.

రైళ్ల వేగానికి పరిమితి?

కాజీపేట-బల్లార్ష మార్గంలో రైల్వేశాఖ 3వలైన్‌ నిర్మిస్తోంది. గతేడాదే పనులు చేపట్టగా.. అటవీప్రాంతంలో ఆ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 24హెక్టార్ల అటవీభూమిని బదలాయించాలని రైల్వేశాఖ కోరింది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణులకు రైళ్లతో ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లలో ఈ మార్గంలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.

పులులు, చిరుతలు తిరిగే ప్రాంతంలో ట్రాక్‌ ఇరువైపులా కంచె వేయడం లేదా రైళ్ల వేగాన్ని తగ్గించాలన్న షరతులు పెట్టాలని అటవీశాఖలో చర్చ జరిగినట్లు సమాచారం. శనివారం సమావేశంలో ఈ షరతులను పెడుతుందా? సాధారణ నిబంధనలే పెడుతుందా? అన్నది చూడాలి.

ఇదీ చూడండి: సవాళ్ల పథంలో బడ్జెట్ రథం.. స్వప్నం సాకారమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.