ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోల అరుణ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దీనిని భాజపా జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ప్రారంభించారు.
యువత సేవాభావంతో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని రఘునాథ్ అన్నారు. సేవా కార్యక్రమాల్లో బీజేవైఎం ముందుండాలన్నారు. గురువారం 80 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, కౌన్సిలర్ అనిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: డార్లింగ్ వచ్చేసింది.. స్వీటీ కాసేపట్లో వస్తుంది..