ETV Bharat / state

'స్థానికం ప్రత్యేకత' జడ్చర్లలో ఎంపీపీ ఎన్నిక లేదు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా అంతటా ఒక పరిస్థితి ఉంటే జడ్చర్ల మండలంలో మాత్రం భిన్నంగా ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా... జడ్చర్లలో మాత్రం ఎంపీటీసీ ఎన్నిక నిలిపివేశారు.

author img

By

Published : Apr 23, 2019, 8:01 PM IST

Updated : Apr 23, 2019, 8:09 PM IST

'స్థానికం ప్రత్యేకత' జడ్చర్లలో ఎంపీపీ ఎన్నిక లేదు

ఉమ్మడి మహబూబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపిటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరగడం లేదు. ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో... కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహిస్తున్నారు.

ఎన్నికలు ఎందుకు లేవంటే?

జడ్చర్ల మండలంలో 2014 లో అంతటా జరిగినట్లే ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కానీ అనంతరం ఎంపీపీ ఎన్నిక, మొదటి పాలకవర్గ సమావేశం మాత్రం ఆలస్యమైంది. మే 4వ తేదీ 2015లో జరిగింది. దీంతో ఆ పాలకవర్గానికి ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి కాలేదు. వీరి పదవీకాలం మరో 10 నెలలు ఉండడంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం ఇక్కడ జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహిస్తున్నారు.

అసలు విషయం ఇది...

జడ్చర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడానికి కారణం... గతంలో బాదేపల్లి పురపాలికలో కావేరమ్మపేట పంచాయతీని కలపడంతో ఆ పంచాయతీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్ట్​ స్టే ఇచ్చింది. పురపాలిక నుంచి తిరిగి కావేరమ్మ​పేట పంచాయతీని మినహాయించి ఎన్నికలు నిర్వహించారు. ఆ కారణంగా జడ్చర్ల ఎంపీపీ ఎన్నిక ఆలస్యమైంది. పాలకమండలి కూడా 10 నెలల తర్వాత కొలువుదీరింది. ప్రస్తుతం మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. మరో10 నెలల తర్వాతే జడ్చర్ల మండలంలో ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి

Intro:ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం ఎంపీటీసీ ఎన్నికలు అనంతరం ఎంపీపీ ఎన్నిక జరగడం లేదు ఈ మండలంలో లో ఎంపిటిసి ఎన్నికలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఇక్కడ కేవలం జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి జిల్లా అంతటా ఒక పరిస్థితి ఉంటే జడ్చర్ల మండలంలో మరో పరిస్థితి ఉండడం ఆసక్తికరంగా మారింది

Body:జడ్చర్ల మండలంలో లో గత పర్యాయం 2014 లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల అనంతరం run mp3 n ఇక జరగాల్సి ఉండగా మే 4వ తారీఖు 2015లో మొదటి సమావేశం జరిగింది దీంతో ఆ పాలకవర్గానికి ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి కాలేదు మరో పది నెలలు ఉండటంతో 2015 ఎంపికైన ఎంపిపి ఎంపీటీసీ లకు పదవి కాలం ఉండడంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసింది దీంతో ఇప్పుడు కేవలం జడ్పిటిసి మాత్రమే జరుగుతుండడంతో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి

Conclusion:జడ్చర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగక పోవడానికి కారణం గతంలో బాదేపల్లి పురపాలిక లో లో కావేరి అమ్మపేట పంచాయతీని కలపడంతో ఆ పంచాయతీ వారు స్థానాన్ని ఆశ్రయించారు పురపాలక నుంచి తిరిగి కావేరి అంబర్పేట పంచాయతీని మినహాయించి ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు దీంతో ఈ పంచాయతీలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపివేశారు మండలంలో కూడా మీతో స్థానాలకు కూడా ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల మండలంలో మాత్రం 15 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు
Last Updated : Apr 23, 2019, 8:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.