తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవటం లేదని ఓ వ్యక్తి తన భార్యతో కలిసి మహబూబాబాద్ జిల్లా బయ్యారం తహసీల్దార్‌ను నిర్బంధించాడు. మాజీ నక్సలైట్ కాశీరాం లొంగిపోయినందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. కొన్నేళ్లుగా సాగుచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నాడు. కొంతమంది గిరిజనులు ఆ భూమి మాదంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. రెవిన్యూ అధికారులు ఆ భూమి వైపు ఎవరూ వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు. కాశీరాం గత కొన్నిరోజులుగా ఆర్డీఓ, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల.. తహశీల్దార్ పుల్లారావును కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగాడు. భూమిని సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడం వల్ల బాధితుడు శాంతించాడు. గతంలో కూడా ఇదే తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో భార్యభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇవీ చూడండి: 'వరంగల్ కామాంధుడిని ఉరితీయాలి'