ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి జిల్లా అధికారులు నడుం బిగించారు. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించేందుకు పాటలు, వీధి నాటకాలు ప్రదర్శిస్తూ పలు సదస్సులు నిర్వహిస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా... మొక్కలు, జూట్ బ్యాగ్లు, స్టీల్ డబ్బాలు అందజేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరికొన్ని రోజుల్లో జిల్లాలో ప్లాస్టిక్ వాడకమే కనిపించకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : వీళ్లు పర్యావరణహిత సంచులు తయారు చేస్తున్నారు!