నిరంతరం అభివృద్దికి అండగా నిలిచే రాష్ట్రప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ 61వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇది తలసేమియా బాధితుల కోసం ఉపయోగపడుతుందని మేయర్ సునీల్ రావు తెలిపారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించకూడదని వినోద్‌కుమార్ సూచించారని.. అయినా సామాజిక కార్యక్రమాలు చేపట్టినట్లు మేయర్ వెల్లడించారు.
కరీంనగర్ స్మార్ట్‌సిటీ వైపు అడుగులు వేస్తోందంటే దానికి ప్రధాన కారణం వినోద్‌కుమార్ కృషేనని మేయర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు నిరాడంబరంగా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర అభివృద్దిలో వినోద్‌కుమార్ పాత్ర కీలకమని.. ఆయన సేవలు ప్రజలకు ఎంతో అవసరమని మేయర్ సునీల్ రావు వివరించారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?