కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో 101వ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు నమోదైన కారణంగా రేపు రీ పోలింగ్ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన పోలింగ్లో ఓ మహిళ వేరే మహిళ ఒటును వేశారు. సాయంత్రం నాలుగు గంటలకు అసలు ఓటరు రాగా అప్పటికే ఓటు వేశారని అధికారులు చెప్పారు. తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆమె కోరాగా అధికారులు విచారణ నిర్వహించి టెండరు ఓటు వినియెగించుకునేందుకు అవకాశం కల్పించారు.
ఒక్క టెండర్ ఓటు పడినా రీపోలింగ్ జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం వల్ల రేపు రీ పోలింగ్ జరపనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 41వ వార్డులోని 101 వ కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రీపోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు