ETV Bharat / state

భయం వీడండి... మై ఆటో ఈజ్ సేఫ్

గతంలో ఆటో ఎక్కాలంటే చిన్నారులు, మహిళలు, విద్యార్థినుల్లో ఒక విధమైన భయం ఉండేది. ఎందుకంటే తమని గమ్యస్థానాలకు తీసుకెళ్లే డ్రైవర్ ప్రవర్తన తెలియదు కాబట్టి.. సహజంగా ఈ రకమైన భయాలుండేవి. కానీ పరిస్థితి మారింది. కాలనుగుణంగా వస్తున్న మార్పుల్లో పోలీసులు.. ఆటో డ్రైవర్లకు సాంకేతికతను అందిపుచ్చారు. తమ పర్యవేక్షణలో ప్రయాణికులను సేఫ్​గా గమ్యస్థానాలకు చేర్చే విధంగా మై ఆటో సేఫ్ యాప్​ను అందుబాటులోకి తెచ్చారు.

My auto is safe
మై ఆటో ఈజ్ సేఫ్
author img

By

Published : Apr 16, 2021, 4:17 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో 1,000 పైగానే ఆటోలుంటాయి. నిత్యం అవసరాల నిమిత్తం ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ఆటో డ్రైవర్ల వల్ల ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులు ఎక్కడా పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్... గత నెల 20న ప్రయాణికుల భద్రత కోసం 'మై ఆటో ఈజ్ సేఫ్' పేరిట క్యూఆర్ కోడ్​ రూపొందించారు. ప్రతి ఆటోకు క్యూఆర్ స్టిక్కర్ వేయించేలా చర్యలు తీసుకున్నారు.

క్యూఆర్ కోడ్...

ఆటో డ్రైవర్ ప్రవర్తన బాగుంది. మేము ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామన్న నమ్మకం కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులు తమ వద్ద స్మార్ట్ ఫోన్​తో క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయాలి. చేసిన వెంటనే jgd.safe.gadi.com అనే ఆప్షన్ వస్తుంది. ఆ లింక్​ను క్లిక్ చేయగానే ఆటోలో ప్రయాణం ఎలా సాగుతుందో వివరాలు చూపుతుంది. తమ ప్రయాణ అనుభూతి అంశాలు అందులో క్లిక్ చేయాలి.

ఇలా చేయడం వల్ల తమ ప్రయాణ వివరాలు... అన్నీ పోలీసు యంత్రాగానికి సాంకేతిక ఆధారంగా తెలిసిపోతాయి. సురక్షితంగా ప్రయాణికుల ప్రయాణం సాగుతుందా? లేదా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? అన్న నిశిత పరిశీలన ఎప్పటికప్పుడు పోలీసులు చేస్తుంటారు. తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

క్యూఆర్ కోడ్ ప్రయోజనాలు...

డ్రైవర్లు తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. డ్రైవర్ల పట్ల నమ్మకం ఏర్పడుంది. తమ వస్తువులు మరిచిపోతే కూడా తిరిగి పొందే వీలు ఏర్పడుతుంది. ఇబ్బందులకు తావుండదు. తాము పోలీసు పర్యవేక్షణలో ప్రయాణిస్తున్నామన్న గట్టి నమ్మకం ఏర్పడుతుంది.

సద్వినియోగం చేసుకోండి...

క్యూఆర్ కోడ్​ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రంజన్ రతన్​కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్​ను స్కాన్ చేసుకోవాలని సూచించారు. ఆటో వివరాలు మొత్తం కోడ్​లో నిక్షిప్తమై ఉంటాయని వివరించారు. ఏ ఆపద వచ్చినా... పోలీసు సేవలు తక్షణం పొందవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ చాలా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

జిల్లా పోలీసులు తీసుకొచ్చిన ఈ విధానం చాలా బాగుందని ప్రయాణికులు హర్షం వక్తం చేస్తున్నారు. ఇకపై ధైర్యంగా ఆటోల్లో ప్రయాణించే వీలు ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 3,840 కరోనా కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.