దావానంలా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో అనుమానితుల నిర్ధరణకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రెవిన్యూ, వైద్య, పోలీసు అధికారులతో గ్రామాల్లో పర్యటించి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తూ వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
సౌదీ అరేబియాలోని తను కుమార్తె దగ్గరకు వెళ్లి ఈనెల 10న జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుకు తిరిగి వచ్చిన కుటుంబ వివరాలు అధికారులు సేకరించారు. 10న స్వదేశానికి తిరిగి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేకపోవడం వల్ల ఇంటికి పంపారు. అయినప్పటికీ ఇవాళ మరొక సారి వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్