Preethi Funeral Arrangements At Girnitanda: తోటి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో.. ఆత్మహత్య చేసుకున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతూ.. నిన్న తుదిశ్వాస విడిచింది. అయితే ఆమె మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత.. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ప్రీతి స్వస్థలమైన జనగామ జిల్లాలోని గిర్నితండాకు తీసుకువచ్చారు. అక్కడే ఆమె అంత్యక్రియలను మధ్యాహ్నం నిర్వహించడానికి కుబుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గిర్నితండాకు ప్రీతి మృతదేహం తీసుకురావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనతో వారికున్నా అనుబంధాన్ని గుర్తుచేసుకుని గ్రామస్థులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సందర్శనార్థం.. ప్రీతి మృతదేహాన్ని తండ్రి ఇంటి స్థలంలో ఉంచారు. ఇక్కడే తన అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తండాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న తొలి విద్యార్థినిగా నిలిచి గుర్తింపు తెచ్చుకుందని గ్రామస్థులు వాపోయారు. చిన్నప్పటి నుంచి ప్రీతి విద్యలో ఎలా రాణించిందో అందరూ గుర్తుచేసుకున్నారు. తనతో వారు పంచుకున్న అనుబంధాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
Medical student Preeti passed away పదో తరగతి, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి.. మొదటి ప్రయత్నంలోనే మెడికల్ సీటును సంపాదించి.. పీజీ మెడికల్‌లో విద్యలో రాణిస్తుందని తెలిపారు. దీంతో చుట్టుపక్కల ఉండే గ్రామాలు, తండాలలోని పిల్లలకు చదువు విషయంలో ఎంతో ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు అన్నారు. అలా చూసిన తనని నేడు ఇలా జీవశ్చవంలా పడి ఉండడం చూసి.. తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతలోనే ప్రీతి తల్లిదండ్రులు రావడంతో ఇంకా ఆ ప్రాంతంలో విషాదఛాయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎటుచూసిన విషాదమే కనిపిస్తుంది. పండగలకు, శుభకార్యాలకు తండాకు వచ్చినప్పుడు అందరితో కలిసిమెలసి ఉండేదని.. పిల్లలకు విద్యకు సంబంధించిన విషయాలను నేర్పించేదని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఆస్తులు అన్నీ అమ్మి.. ప్రీతి తండ్రి నరేందర్ పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నాడన్నారు.
హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిగా నరేందర్ స్థిరపడ్డాడు. తన నలుగురు పిల్లలను చదివించాలనే ఉద్దేశ్యంతో.. తన ఆస్తులు అమ్మీ వారికి విద్యా బుద్ధులు నేర్పించాడు. వరంగల్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతిని.. అదే కళాశాలలో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడంతో బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదురోజులు నిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతూ.. నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది.
ఇవీ చదవండి: