Municipal commissioner cried in front of collector సామాన్యుల కష్టాలు పరిష్కరించే.. ప్రజావాణిలో ఓ అధికారి సైతం కన్నీటి పర్యంతమైంది. స్థానిక ఆర్టీవో.. తనని హీనంగా చూస్తున్నారంటూ... జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ప్రజావాణిలో కలెక్టర్ ముందే మున్సిపల్ కమిషనర్ రజిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
జనగామ ఆర్డీఓ మదన్ మోహన్ తనకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందారు. తనను అటెండర్ కంటే హీనంగా చూస్తున్నారని రజిత ఆవేదన చెందారు. ఈ విషయమై కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆర్డీఓ ఏ రకంగా తనను ఇబ్బంది పెడుతున్నారో... వివరిస్తూ మున్సిపల్ కమిషనర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రజిత ఆవేదన విన్న కలెక్టర్.. కమిషనర్ రజితను ఓదార్చారు. తన సమస్యేంటో పూర్తిగా తెలుసుకున్న కలెక్టర్.. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రజావాణిలో ఒక్కసారిగా ఓ మున్సిపల్ కమిషనర్ ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం సర్వాత్రా చర్చనీయాంశమైంది.
ఇవీ చూడండి: