సన్న రకాల సాగు రైతులను నిండా ముంచింది. తెగుళ్లతో పాటు అకాల వర్షాల కారణంగా పంట పడిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేశం వేసిన నాలుగు ఎకరాల పంట పడిపోయింది. దిగుబడి రాలేదన్న మనస్తాపంతో పంట కాల్చి వేశాడు.
రైతుకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా... నాలుగు ఎకరాల్లో దొడ్డు రకాలు.... మరో నాలుగు ఎకరాల్లో సన్నాలు సాగు చేశాడు. పంటను తెగుళ్లు, అకాల వర్షాలు దెబ్బతీశాయని రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ చెప్పటం వల్లే సన్నాలు సాగు చేశానని రైతు తెలిపాడు. ప్రభుత్వం మాట విని తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నాడు.