YSRTP comments on State Womens Commission: తెలంగాణలో రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమా.. లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా.. అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళా అధ్యక్షురాలు గడిపల్లి కవిత ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల హక్కులను కాపాడాటానికి ఉన్న మహిళా కమిషన్... అధికార పార్టీ బీఆర్ఎస్కు సొంత కమిషన్‌గా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించడం సంతోషమే అన్నారు.
అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అధికార పార్టీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తే స్వయంగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గతంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్ షర్మిలను అవమానిస్తే... మహిళా కమిషన్‌కు కనబడలేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత విషయంలో మహిళా కమిషన్‌కు బాధ్యత గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇలాంటి పక్షపాత వైఖరికి నిరసనగా.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు గడిపల్లి కవిత తెలిపారు.
"తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. పాలక వర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. మగువల హక్కులను కాపాడటానికి ఉన్న మహిళా కమిషన్... అధికార పార్టీ బీఆర్ఎస్కు సొంత కమిషన్‌గా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను... సుమోటోగా స్వీకరించడం సంతోషమే కానీ అదే వైఎస్ఆర్తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అధికార పార్టీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తే స్వయంగా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధకరం. గతంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్ షర్మిలను అవమానిస్తే.. మహిళా కమిషన్‌కు ఇవి కనబడలేదా? ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత విషయంలో రాష్ట్ర మహిళా కమిషన్‌కు బాధ్యత గుర్తుకు వచ్చింది. ఇలాంటి పక్షపాత వైఖరికి నిరసనగా... దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్నాము". -గడిపల్లి కవిత, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళా అధ్యక్షురాలు
ఇవీ చదవండి: