Uttam Kumar Comments on KCR : పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడడంపై.. బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోదీ అపహస్యం చేశారని ఆరోపించారు. సోనియాగాంధీ సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని స్పష్టం చేశారు. ఉద్యోగాల విషయంలో రాష్ట్రంకు అన్యాయం జరుగుతోందని.. 1200 మంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో బలిదానాలు ఉండవని భావించామని.. కాని అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Uttam kumar Speech on Formation day : తెలంగాణ ఏర్పాటుకు గురించి అప్పటి హోంమంత్రి చిదంబరంతో ఆయన రెండు సార్లు చర్చించానని.. అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. బిల్లు పాస్ రోజున కేసీఆర్ పార్లమెంటులో లేరని ఆరోపించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ హైదరాబాద్ వస్తే కలవలేదని.. మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిది సంవత్సరాలు పూర్తయితే ఎన్నికల కోసం ఒక ఏడాది ముందుగానే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు.
Uttam Kumar Reddy comments on BJP : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం తగ్గుతోందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కర్ణాటకలో ఈ నెల 13న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు నుంచి తెలంగాణలో బీజేపీ బలం తగ్గుతూ వస్తోందని ఆరోపించారు. ఇటీవల బీజేపీలో ఎవరు మాట్లాడినా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీలో ఇన్ సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీపై వ్యతిరేకత ఎక్కువైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని.. ఈ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి లాభదాయకమని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ఉన్న పేరును వినియోగించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు.
'రాజకీయాల్లో గెలవడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా అవసరం'
Delhi Liquar Scam Latest update : మద్యం లిక్కర్ కేసులో ప్రముఖ పాత్ర ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఆయన అప్రువర్‌గా మారినందున లిక్కర్ కేసు తీవ్రత పెరుగుతుందని.. నిజాలను చెబితే ఆప్ పార్టీకి చావుదెబ్బ అవుతుందని పేర్కొన్నారు. ఇటీవల వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక ప్రముఖ నాయకుడు డీకే శివకుమార్‌ని కలిశారు. ఆమె కాంగ్రెస్‌లో చేరుతుందని పలు ఆరోపణలు వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందో లేదో తెలియదని ఉత్తమ్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్‌లోని పెద్ద నాయకులు ఎవరో ఆమెతో మాట్లాడినట్టు ఆయన భావిస్తున్నారని అన్నారు.
"రాష్ట్రంలోని నిరుద్యోగుల విషయంలో అన్యాయం జరుగుతుందని 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై నేను పెద్దలతో రెండు సార్లు చర్చించాను. ఈ విషయం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. తెలంగాణ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం మీరా కుమార్ మాత్రమే."- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ
ఇవీ చదవండి :