TSRTC Dussehra 2023 Lucky Draw : రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు లక్కీడ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను యాజమాన్యం అందించనుంది. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు కలిపి మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతులను ఆర్టీసీ ఇవ్వనుంది. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని ఆర్టీసీ వెల్లడించింది.
TSRTC Special Buses For Dussehra Festival : దసరా స్పెషల్.. 13వ తేదీ నుంచి 5,265 ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్న తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల ప్రయాణికుల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి అని ఆర్టీసీ సూచించింది. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్‌లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్‌లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు.
TSRTC Dasara Special Lucky Draw Offer : సెప్టెంబర్ 31న రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ నిర్వహించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ.5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి సంస్థ ఘనంగా సత్కరించింది. రాఖీ పౌర్ణమి స్ఫూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. తెలంగాణలో బతుకమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో కొంత మందికి రాఖీ పౌర్ణమి మాదిరిగా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులను నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
TSRTC Electric Buses Inauguration in Hyderabad : భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు.. రయ్ రయ్
ఆయా తేదీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు సైతం ఈ లక్కీ డ్రాకు అర్హులే అని ఆయన పేర్కొన్నారు. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్‌లను ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేస్తుంది. రాఖీ పౌర్ణమి లాగే దసరా లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..
Prathidhwani : నెరవేరిన TSTRC ఉద్యోగులు, కార్మికుల చిరకాల డిమాండ్.. ఎవరికి ప్రయోజనం..?