ETV Bharat / state

TS icet seat allotment 2021: ఐసెట్ సీట్ల కేటాయింపు పూర్తి.. ఇంకా ఎన్ని మిగిలాయంటే?

author img

By

Published : Nov 26, 2021, 3:45 PM IST

ఐసెట్ తుది విడత సీట్ల(tsicet 2021 counselling) కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక మిగిలిన సీట్ల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

TS icet seat allotment 2021, tsicet 2021 counselling
ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి

tsicet seat allotment 2021 results: ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఎంబీఏలో 19,867 సీట్ల కేటాయింపు పూర్తికాగా... మరో 5,421 సీట్లు మిగిలాయి. ఎంసీఏలో 2,535 సీట్ల కేటాయించగా... 41 సీట్లు మిగిలాయి.

సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. డిసెంబరు 1 నాటికి కాలేజీల్లో చేరాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మిగిలిన సీట్ల కోసం ఈనెల 28న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 28, 29 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. ఈనెల 29న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుందని వెల్లడించారు. ఈనెల 30న ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయిస్తారు.

డిసెంబరు 1న ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి కాలేజీల్లో చేరాలి. ప్రైవేటు కాలేజీల్లో మిగిలిన ఎంబీఏ, ఎంసీఏ సీట్ల స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 30న మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

ఇదీ చదవండి: ఫ్రెషర్స్​ పార్టీ తెచ్చిన తంటా.. మెడికల్ కాలేజీలో 182 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.