తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన వరి పంట కాకుండా వేరే పంట వేస్తే రైతుబంధు వర్తించదని సీఎం కేసీఆర్ అన్నారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం, వర్షాకాలంలో మక్క పంటకు బదులుగా కందులు వేయాలని అన్నారు.
ఏ పంటను ఎప్పుడు పండించాలనేది
రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నుల వరకు ఉందన్నారు. యాసంగిలోనే మక్క పంట వేయాలన్నారు. ఏ పంటను ఎలా ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈసారి 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేద్దాం, కంది పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందన్నారు.
అమల్లో కొత్త వ్యవసాయ విధానం
2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలని, ఎప్పటిలాగే 1.25 లక్షల ఎకరాల్లో పసుపు పంట వేసుకోవచ్చని సూచించారు. మిర్చి, సోయాబీన్, మామిడి, బత్తాయి ఎప్పటిలాగే వేసుకోవచ్చన్నారు. కొత్త వ్యవసాయ విధానం అమల్లో కలెక్టర్ల మధ్య పోటీ ఉంటుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడి మన ధాన్యం అమ్ముడవ్వాలన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ : సీఎం కేసీఆర్