ETV Bharat / state

Teenmar mallanna: తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు - telangana top news

తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా వీడియోలు రూపొందిస్తున్నారని తెరాస సోషల్‌ మీడియా విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

trs-social-media-convenors-filed-case-against-teenmar-mallanna
తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు
author img

By

Published : Aug 25, 2021, 10:41 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​పై సామాజిక మాధ్యమాల వేదికగా తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసున్నారంటూ... తెరాస సోషల్ మీడియా కన్వీనర్లు హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ అనే వృత్తిని అడ్డుపెట్టుకొని... యూట్యూబ్ అడ్డాగా ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కన్వీనర్ క్రిశాంక్ అన్నారు. ఆయనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రజాస్వామికంగా ఓ వ్యక్తి బయటకొచ్చి... తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడని క్రిశాంక్ తెలిపారు. పోలీసుల దర్యాప్తును ఎదుర్కోలేక మల్లన్న.. కరోనా అని చెప్తూ తిరగడం హాస్యాస్పదమన్నారు. కరోనా ఆరు రోజుల్లో వచ్చి పోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం పోలీసుల విచారణను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్​పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని క్రిశాంక్ అన్నారు.

బొక్కలో ఏశి తోముతున్నరు

ఉత్తర ప్రదేశ్​లో ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే... 24 గంటల్లోపే జైలుకి తరలించి వారిపై చర్యలు తీసుకుంటున్నారని క్రిశాంక్ తెలిపారు. అలాగే ఏపీలో ఒక ఎంపీ... ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం.. ఓ కేంద్రమంత్రి గురించి తప్పుగా మాట్లాడినందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అలాగే సీఎం కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు వివరించారు.

బిడ్జా సూస్కో.. మాకెంత సేపు పట్టదు

చింతపండు నవీన్ కుమార్.. చట్టబద్ధంగా నీ మీద చర్యలు తీసుకుంటం. కానీ నవ్వు ఇయాల... దమ్ముందా అని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినవ్. నీకు ముఖ్యమంత్రి గారు అవసరం లేదు. టీఆర్​ఎస్ కార్యకర్తలు, సోషన్ మీడియా వాళ్లు చాలు. నువ్వు మానుకోకపోతే... బిడ్డా సూస్కో.. మాకెంత సేపు పట్టదు. నీకు మేమెంత దూరంలో ఉన్నవో, మాకంతే దూరంలో ఉన్నవు. కొద్ది నిమిషాల్లోనే నీ దగ్గర వరకు రాగల్గుతం. కానీ ప్రజాస్వామ్య పాలనను మేము గౌరవిస్తున్నం. నువ్వు యూట్యాబ్​ను అడ్డంబెట్టుకోని ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే నీకు కార్యాలయానికి రాకపోవడం తప్పదు. ఖచ్చితంగా వస్తమని హెచ్చరికలు జారీ చేస్తున్నం. - క్రిశాంక్, తెరాస సోషల్ మీడియా కన్వీనర్

ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా... తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలని సైబర్ క్రైం ఏసీపీని కోరినట్లు తెలిపారు. ఇప్పటికైనా మల్లన్న తన వైఖరిని మార్చుకోకపోతే... క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.

తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

ఇదీ చూడండి: Thinmar mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.