ETV Bharat / state

రెండోసారి కరోనా బారిన పడిన ఎమ్మెల్యే... చెన్నైలో చికిత్స

author img

By

Published : Oct 8, 2020, 8:02 PM IST

వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన... కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్​గా తేలింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

tirupati-mla-bhumana-karunakar-reddy-tested-positive-for-covid-19
రెండోసారి కరోనా బారిన పడిన ఎమ్మెల్యే...

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన... తిరుపతిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్​లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

పాజిటివ్ రావడంతో మరోసారి తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు చేశారు. ఇందులో కూడా పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో రుయా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని భావించారు. అయితే తీవ్రమైన జ్వరం, దగ్గు, మధుమేహం, అధికరక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్య అవసరమైన దృష్ట్యా... చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు.

రెండు నెలల క్రితం....

కరుణాకరరెడ్డి రెండు నెలల క్రితం తొలిసారిగా కరోనా బారిన పడ్డారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలను చైతన్యపరిచే క్రమంలో నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు కరోనా పరీక్షలు తరచూ చేయించుకొనేవారు. ఈ క్రమంలో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్​గా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆగష్టు 25న చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరారు. పది రోజులపాటు చికిత్స పొందిన అనంతరం సెప్టెంబర్ 3న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదీ చదవండి: కరోనాకు ఒకే కుటుంబంలో ఒక తరం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.