Telangana TDP New President: తెలుగుదేశం పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ సైకిలెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులును నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: