ETV Bharat / state

మేడారం జాతరకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..!

RTC Special buses from Hyderabad to Medaram Jatara : మేడారం సమ్మక్క జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 680 ప్రత్యేక బస్సులను నడుపుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ శానిటైజేషన్ చేయడంతో పాటు.. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

RTC Special buses from Hyderabad to Medaram Jatara, rtc medaram special buses
మేడారం జాతరకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..!
author img

By

Published : Feb 3, 2022, 8:12 AM IST

RTC Special buses from Hyderabad to Medaram Jatara : మేడారం సమక్క-సారలమ్మ మహాజాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు మేడారం ప్రత్యేక బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమ్మక్క జాతర స్పెషల్ బస్సులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్​సుఖ్ నగర్ బస్ స్టేషన్, నేరేడ్ మెట్, జగద్గిరిగుట్ట, లింగంపల్లి, కేపీహెచ్​బీ, కూకట్​పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరి... ఉప్పల్​లోని వరంగల్ పాయింట్ మీదుగా నడుస్తాయని వివరించారు.

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

Sammakka jatara 2022: మేడారం గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయని... సుశిక్షితులైన డ్రైవర్ల పర్యవేక్షణలో బస్సులను నడుపుతామని చెప్పారు. ప్రయాణం సురక్షితమని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈనెల 13వ తేదీన 39 బస్సులు, 14న 48, 15వ తారీఖున 94, 16న 167, 17న 132, 18న 138, 19న 68, 20వ నాలుగైదు బస్సులు.. ఇలా మొత్తం 680 బస్సులను నడిపించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు www.tsrtconline.in ద్వారా కానీ, సమీప ఏజెంట్ల వద్ద కానీ, ఎంజీబీఎస్, దిల్​సుఖ్ నగర్ బస్ స్టేషన్లలో కూడా సీట్లను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.

'రెండేళ్లకోసారి వచ్చే వనజాతర కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. 13వ తారీఖు నుంచి 20 వరకు హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి 680 బస్సులు నడుస్తాయి. నగరంలోని ఆయా బస్​స్టాండ్ల నుంచి బస్సులు బయల్దేరుతాయి. సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారు. అమ్మవార్ల గద్దెలకు చాలా దగ్గరకు పోతాయి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. కాబట్టి భక్తులందరూ ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలి.'

-వరప్రసాద్, రంగారెడ్డి రీజనల్ మేనేజర్

మేడారం జాతరకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..!

ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి బస్సుల ఛార్జీలు...

  • ఎక్స్ ప్రెస్: పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.240
  • డీలక్స్ : పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.270
  • సూపర్ లగ్జరీ : పెద్దలకు రూ.570లు, పిల్లలకు రూ.310
  • గరుడ ప్లస్ బస్ ఏసీ: పెద్దలకు రూ.890లు, పిల్లలకు రూ.680

జంట నగరాల పరిసర ప్రాంతాల నుంచి... ఛార్జీలు

  • ఎక్స్​ప్రెస్ బస్సులు : పెద్దలకు రూ.470లు, పిల్లలకు రూ.250
  • డీలక్స్ : పెద్దలకు రూ.530లు, పిల్లలకు రూ.290
  • సూపర్ లగ్జరీ : పెద్దలకు రూ.600లు, పిల్లలకు రూ.320
  • గరుడప్లస్ ఏసీ : పెద్దలకు రూ.930లు, పిల్లలకు రూ.720

ఇదీ చదవండి: Medaram Jatara 2022: మేడారం జాతరకు కోటి మంది భక్తులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.