ETV Bharat / state

నేడు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారా - తొలి సంతకం దేనిపై చేస్తారో? - ఆరు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం

Telangana CM Revanth Reddy to Sign on Six Guarantees : సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నేడు జరగబోయే ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై సంతకం చేసే అవకాశం ఉంది. దీంతో తొలి సంతకం దేనిపై చేస్తారు? సీఎం హోదాలో ఆయన ఏ వర్గానికి శుభవార్త చెబుతారా అని యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుంది. అటు గ్యారెంటీల అమలు కోసం అయ్యే ఖర్చు, ఖజానాపై ఆర్థిక భారానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Congress Government on Guarantees
Telangana CM Revanth Reddy to Sign on Six Guarantees
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 9:51 PM IST

Updated : Dec 7, 2023, 6:40 AM IST

Telangana CM Revanth Reddy to Sign on Six Guarantees : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గ్యారెంటీల అమలుపై సంతకం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించింది. దీంతో నేడు ప్రమాణ స్వీకారం అనంతరం ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం

గ్యారెంటీల అమలుకు సంబంధించిన దస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతకు సంబంధించి ఒక దస్త్రం రూపొందినట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్​కు(Job Calendar) సంబంధించిన మరో దస్త్రాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని కూడా ప్రచార సమయంలో రేవంత్ ప్రకటించారు. మరి రేపు వీటిపై ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని అంటున్నారు. అటు గ్యారెంటీల అమలు కోసం అయ్యే ఖర్చు, ఖజానాపై ఆర్థిక భారానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే :

1. మహాలక్ష్మి పథకం : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని మొదటి గ్యారెంటీగా సోనియా మహాలక్ష్మి పథకాన్ని(Mahalaxmi Scheme) ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు.

2. రైతు భరోసా పథకం : దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ప్రాణాలను కాపాడుకునేందుకు, అన్నదాత అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతుభరోసా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15,000, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15,000 రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 చెల్లిస్తామని తెలిపారు. వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌ అందజేస్తామని వెల్లడించారు.

3. గృహజ్యోతి పథకం : ఈ పథకం కింద గృహ అవసరాలకు(GruhaJyothi Scheme) ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందజేయనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు - మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

4. ఇందిరమ్మ ఇళ్ల పథకం : ఈ స్కీం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం(Indiramma Inti Scheme) ఇస్తామని ప్రకటించారు.

5. యువ వికాసం పథకం : యువవికాసం కింద కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు . ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లించనున్నారు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పన చేయనున్నారు.

6. చేయూత పథకం : వితంతు మహిళలకు , చేనేత కార్మికులకు, వికలాంగులకు , వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.4,000ల పింఛను అందజేయనున్నారు. మరోవైపు దళిత, గిరిజన బంధు కింద దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. చేయూత పథకం(Cheyutha Pension Scheme) కింద రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అందజేయనుంది.

ఎల్బీ స్టేడియం సీఎంగా రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం - ముస్తాబవుతున్న మూడు వేదికలు

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్​ రెడ్డి అభయహస్తం

Last Updated : Dec 7, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.