పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. ఈ మేరకు నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ.. సికింద్రాబాద్లోని చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రసూన తెలిపారు. కాని ప్రస్తుతం పోషక విలువలు కలిగిన ఆహారం ధరలు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించి అత్యధిక ధరలకు విక్రయిస్తోన్న దళారీలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాడు ఏకగ్రీవ జోరు.. నేడు పోరు!