ETV Bharat / state

హైదరాబాద్​ ఆస్పత్రుల్లో "నో బెడ్స్‌" బోర్డులు దేనికి సంకేతం?

రాజధాని నగరంలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. లాక్​డౌన్​ ఉన్నంతవరకూ అణిగిమణిగి ఉన్నట్టు.. కనిపించిన కరోనా వైరస్​.. లాక్​డౌన్​ సడలింపుల తర్వాత ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని స్వైర విహారం చేస్తోంది. ఆరోజు నుంచి ఎక్కడా తగ్గేది లేదంటూ.. చెలరేగిపోతుంది. సింగిల్​ డిజిట్​ నుంచి ప్రారంభమై.. ఇప్పుడు నాలుగు అంకెలకు రోజువారి కేసులు చేరాయంటే.. కరోనా వ్యాప్తి ఎలా ఉందో అర్థమవుతోంది.

special story on corona hot spot Hyderabadcoro
లాక్​డౌన్​ సడలింపుతో... రాజధానిలో కరోనా విలయతాండవం!
author img

By

Published : Jul 9, 2020, 3:54 PM IST

రోజువారీగా కేసులు పదుల నుంచి వేల వరకు చేరుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ గణంకాలే అందుకు నిదర్శనం.

వివరాలు ఇలా
మే 31 నాటికి 2,698
ప్రస్తుతం 29,536
జీహెచ్ఎంసీ పరిధిలో 23,223
జూన్‌లో 13,741(సగటున రోజుకు 454 )
జులై తొలి వారంలో9,227 (రాష్ట్రంలో)
జులై 1-813,197 (రాష్ట్రంలో)
జులైలోసగటున రోజుకు 1650
బుధవారం నాటికి 11,939(యాక్టివ్ కేసులు)
కోలుకున్నవారు17,279
ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టులు 1,34,801

హాట్‌స్పాట్‌గా హైదరాబాద్‌

రాష్ట్రంలో కరోనా కేసుల్లో హాట్​స్పాట్​గా మారింది రాజధాని హైదరాబాద్​. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచటం వల్ల పాజిటివ్ కేసులు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. అలాగని అదొక్కటే కారణం అని చెప్పలేము. ఈరోజుకీ సామాజిక వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతున్నా... ప్రజలు మాత్రం ఎప్పుడో వ్యాప్తి జరిగిందని బలంగా విశ్వసిస్తున్నారు. తమకు వ్యాధి ఎక్కడ సోకింది అనేది గుర్తించలేని స్థితికి హైదరాబాద్ వెళ్లిపోయింది.

వైఫల్యం ఎవరిది

సరే! ప్రతిపక్ష నేతలు ఎలాగూ ప్రభుత్వాన్ని తప్పుపడుతునే ఉన్నారు. అది వారి హక్కు. కానీ ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేయటం గమనార్హం. ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా నివేదికలపై రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిలో వివరణాత్మక సమాచారం ఎందుకు లేదని ప్రశ్నించింది. టెస్టుల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ ఎదుర్కోలేకపోవటం వల్ల వైద్యారోగ్యశాఖ అధికారులు తడబడుతున్నారు. గతేడాది రాష్ట్రంలో వేలమంది డెంగీ జ్వరాల బారిన పడ్డారు. కార్పొరేట్ ఆస్పత్రిల నుంచి సాధారణ నర్సింగ్‌హోమ్‌ల వరకూ "నో బెడ్స్‌" బోర్డులు పెట్టేశాయి. కొద్దినెలలకే ఇప్పుడు కరోనా వైరస్ రావటం వల్ల మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయట పడుతోంది.

కరోనా లక్షణాలు ఉన్న వారు, వారితో కాంటాక్టు ఉన్న వారూ.. వేలాదిగా టెస్టులకు పోటెత్తడం వల్ల ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి చేయి దాటక ముందే.. ప్రైవేటు రంగంలోనూ కరోనా పరీక్షలకు అనుమతించి ఉంటే ఈ పాటికి పరిస్థితి కొంత కంట్రోల్‌లో ఉండేది. ఆలస్యంగా వారికి అనుమతివ్వటం, అదీ తమకి గిట్టుబాటు కానీ ధరలు నిర‌్ణయించారని ప్రైవేటు ఆసుపత్రులు పెదవి విరవటం వల్ల ఆశించిన ఫలితాలు రావట్లేదు.

ఒకటి మాత్రం సుస్పష్టం

ప్రభుత్వం చిత్తశుద్ధితో కష్టపడుతోంది. వైద్యారోగ్యమంత్రి ఈటెల రాజేందర్‌, ఆయన శాఖ అధికారులు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగంలో వైద్యులు అయితే కంటిమీద కునుకు లేకుండా తమ ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి వేలమందిని కరోనా కోరల్లోంచి రక్షించారు. ఈ క్రమంలో వైద్యులే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ప్రభుత్వం తీర్చలేకపోతోంది.

టెస్టుల కోసం, ఆసుపత్రుల కోసం తిరిగి విసిగి వేశారామని బాధితులు సామాజిక మాధ్యమాల్లో గోడు వెల్లబోసుకోవటమే అందుకు తార్కాణం. చివరగా ఒక విషయంలో ప్రజలను కూడా తప్పు పట్టాల్సిందే. ఇంత హాట్‌స్పాట్‌గా మారినా కూడా హైదరాబాద్‌లో చేపల కోసం, మాంసం కోసం, కూరల కోసం మాస్కులు లేకుండా మార్కెట్లలో జనం విచ్చలవిడిగా తిరుగుతూ స్వీయ నియంత్రణ పాటించకపోవటం కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.