ETV Bharat / state

రాష్ట్రంలో తగ్గిన విద్యుత్​ డిమాండ్ - తెలంగాణలో తగ్గిన కరెంట్ వాడకం

సాధారణంగా వేసవిలో కరెంట్​ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. లాక్​డౌన్​లో ఎక్కువగా ప్రజలు గృహ అవసరాలకు కరెంట్​ను వినియోగిస్తున్నా.. విద్యుత్​ వినియోగం తక్కువగా ఉండటం విశేషం.

Power demand decreaed recent days in telangana
రాష్ట్రంలో తగ్గిన విద్యుత్​ డిమాండ్
author img

By

Published : Apr 29, 2020, 11:44 AM IST

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 4,150 మెగావాట్లకు తగ్గిపోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు అతి తక్కువ డిమాండ్ ఏర్పడినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇంత తక్కువ కరెంట్​ను వినియోగించడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. వాస్తవానికి వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.

లాక్​డౌన్​తో ప్రజలు ఇంటికే పరిమితం అయినప్పటికీ... ఫ్యాన్లు, టీవీలు నిర్విరామంగా నడుస్తున్నా.. రబీ సీజన్ ముగియడం, పరిశ్రమలు మూతపడటం వల్ల కరెంట్​ వినియోగంలో మార్పులు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.