ఆ రైలును ఎప్పుడెప్పుడు చూడొచ్చు?
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం"రైల్ నిలయం" ఎదుట ఈ ఇంజన్ ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న మరమ్మత్తులు చేసి శబ్దం వినిపించేలా, ఆవిరి పొగ వచ్చేలా మార్చేశారు. అంతే కాకుండా ఇంజిను పైన భారీ లైటు యథావిధిగా వెలుగుతుంది. ముందువైపు నక్షత్రం గుర్తును ప్రత్యేకంగా మలిచారు. ఇది చూసినవారికి కొన్ని దశాబ్దాల క్రితం చూసిన అనుభూతి కలిగేలా చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు దీనిని పనిచేసేలా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ రైలును చూసేందుకు చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. ఇంజిను ముందు నిల్చొని స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు. సాయంత్రం సమయంలో ప్రత్యేక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో వర్ణశోభితమైన వెలుగుల్లో మరింత అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తుంది.
రైల్వే శాఖ పాత రైళ్లను కాపాడటం పట్ల పర్యటకులు, నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.