కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మరో 1,498 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఆరుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1729కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ప్రస్తుతం 10 వేలకు చేరువలో కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. 5,323 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 3,14,735కి చేరింది. మరో245 మంది కోలుకోగా.. వైరస్ బారి నుంచి ఇప్పటివరకు 3,03,013 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 313 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో సోమవారం రోజు 62,350మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.
ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
జిల్లాల్లో కేసులు ఇలా..
జిల్లాలు | కేసులు |
ఆదిలాబాద్ | 26 |
భద్రాద్రి కొత్తగూడెం | 09 |
జనగాం | 16 |
జగిత్యాల | 60 |
భూపాలపల్లి | 07 |
జోగులాంబ గద్వాల్ | 09 |
కామారెడ్డి | 08 |
కరీంనగర్ | 46 |
ఖమ్మం | 36 |
ఆసిఫాబాద్ | 07 |
మహబూబ్నగర్ | 22 |
మహబూబాబాద్ | 06 |
మంచిర్యాల | 34 |
మెదక్ | 21 |
మల్కాజిగిరి | 164 |
ములుగు | 05 |
నాగర్కర్నూల్ | 16 |
నల్గొండ | 45 |
నారాయణపేట | 07 |
నిర్మల్ | 06 |
నిజామాబాద్ | 142 |
పెద్దపల్లి | 22 |
సిరిసిల్ల | 43 |
రంగారెడ్డి | 128 |
సంగారెడ్డి | 29 |
సిద్దిపేట | 19 |
సూర్యాపేట | 42 |
వికారాబాద్ | 25 |
వనపర్తి | 16 |
వరంగల్ రూరల్ | 00 |
వరంగల్ అర్బన్ | 62 |
యాదాద్రి భువనగిరి | 29 |
ఇదీ చూడండి: ఐదు రోజుల్లోనే కేసులు రెట్టింపు.. 80 శాతం మందికి లక్షణాల్లేవ్