భారీ వర్షాల కారంణంగా మూసీనదికి వరద పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. బడంగ్‌పేటలో దాదాపు అన్ని కాలనీలు నీట మునగడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బోట్ల సాయంతో కాలనీల్లో తిరుగుతూ ఇళ్లలోనే ఉండి పోయిన వారిని రక్షించారు. ఇప్పటి వరకు 74 మందిని రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా 100కి డయల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: నిండుకుండల్లా చెరువులు.. పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళ