ETV Bharat / state

'అంబేడ్కర్​ ఇంటిపై దాడి హేయమైన చర్య' - mumbai

ముంబయిలో అంబేడ్కర్​ ఇంటిపై జరిగిన దాడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్​ ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ పరిధిలోని అన్నానగర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

mrps leaders protested at contonment in hyderabad
'అంబేడ్కర్​ ఇంటిపై దాడి హేయమైన చర్య'
author img

By

Published : Jul 10, 2020, 6:52 PM IST

ముంబయిలో అంబేడ్కర్​ ఇల్లు రాజగృహపై జరిగిన దాడిని సికింద్రాబాద్​ కంటోన్మెంట్ ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అన్నా నగర్​లోని అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారం రోజుల పాటు ఎమ్మార్పీఎస్​తో పాటు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంబేడ్కర్​ ఇంటిపై జరిగిన దాడిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీబీఐ చేత విచారణ జరిపి ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను బయటకు తీసుకురావాలని కోరారు. కేంద్ర బలగాల చేత అంబేడ్కర్​ ఇంటికి, కుటుంబానికి భద్రత కల్పించాలని వారు విన్నవించారు.

రాజ్యాంగంలోని ఒక్కో ఆర్టికల్​ను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో అంబేడ్కర్​ ఇంటిపై కూడా దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. అంబేడ్కర్​ ఇంటి పై జరిగిన దాడి రాజ్యాంగం పై జరిగిన దాడిగా ప్రతి ఒక్కరూ భావించాలని, బడుగు బలహీన వర్గాల నేతగా పేరొందిన బీఆర్​ అంబేడ్కర్​ ఇంటిపై దాడి అందరినీ కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.