ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాలను గౌరవిస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే వినాయక చవితిని జరుపుకోవాలని మంత్రి సూచించారు.
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్, స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనూ మట్టి విగ్రహాల పంపిణీ చేస్తామని చెప్పారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం... పర్యావరణం కాపాడుదాం అన్న నినాదంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.