ETV Bharat / state

'ఉత్తమ్ ఫోన్ చేస్తే స్పీకర్ స్పందించరు కానీ...'

తెరాసలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ... ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ చేపట్టిన 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యగ్రహా దీక్షకు తెజస అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం తెలిపారు.

author img

By

Published : Jun 8, 2019, 4:04 PM IST

'ఉత్తమ్ కుమార్ ఫోన్ చేస్తే స్పీకర్ స్పందించరు కానీ...'

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడం పట్ల నిరసన తెలుపుతూ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ చేపట్టిన 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యగ్రహా దీక్షకు తెజస, తెదేపా మద్దతు పలికాయి. రాష్ట్రంలో తెరాస అప్రజాస్వామిక పాలన చేస్తుందని ఆర్.సీ కుంతియా విమర్శించారు. దళితుడు ప్రతిపక్షనేతగా ఉండడం సీఎం కేసీఆర్ ఓర్చుకోలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే స్పందించని స్పీకర్... తెరాసలో చేరుతామని 12 మంది వెళ్తే అపాయింట్‌మెంట్‌ ఇస్తారంటూ తెజస అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. అంతా అధికార పక్షమే ఉంటే... ప్రజల సమస్యలపై ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. అధికార పార్టీ విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని కోదండరాం స్పష్టం చేశారు. ఒక పార్టీ విలీనానికి ఆ పార్టీ ఆమోదం తెలపాలని... బీ ఫారం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు ఈ వ్యక్తులు పార్టీలో ఉండాలో లేదో నిర్ణయిస్తారని కోదండరాం వెల్లడించారు.

ఇవీ చూడండి: పాఠశాలలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.