హైదరాబాద్ మౌలాలీ రైల్వే స్టేషన్లోని ఓ రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్టేషన్లో నిలిపిన కాకినాడ- సికింద్రాబాద్ రైలులోని ఓ బోగీకి మంటలు వ్యాపించడం వల్ల అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.
మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేసరికే.. బోగి పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆకతాయిల పనా... అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్: కేసీఆర్