హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పదాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్‌రావు, దత్తాత్రేయ, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, ఇతర అంశలపై జేపీతో నేతలు చర్చలు జరిపారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు నాంపల్లి ప్రదర్శన మైదానంలో భాజపా భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఇవీ చూడండి: జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు