ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు, తాగునీటి సరఫరా, విద్యుత్తు దీపాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారికి రూ.8500 చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న వారికి కూడా రూ.8,500 వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆమేరకు పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు.
ఇవీచూడండి: 4శాతం రాయితీని విడుదల చేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి