IT Raids on BRS MLA Pilot Rohit Reddy : తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు (IT Raids in Telangana ) కలకలం రేపాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.20లక్షలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా కింగ్స్ ఫంక్షన్ హాళ్లు, హోటల్స్ యజమానుల ఇళ్లల్లోనూ, కోహినూరు స్థిరాస్తి వ్యాపార సంస్థ యజమాని నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!
IT Raids in Telangana : ఇటీవలే మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు . మిర్యాలగూడలో వైదేహీనగర్‌లోని ఎమ్మెల్యే బంధువు.. కాంట్రాక్టర్, స్థిరాస్తి వ్యాపారి ఇంజం శ్రీధర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లమోతు భాస్కర్ రావుకు (MLA Nallamothu Bhaskar Rao) దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నట్లు తెలుస్తోంది. పలు పవర్ప్లాంట్లలో ఆయన పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే భాస్కర్ రావు బంధువులు, అనుచరుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
IT Raids in Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు
ఐటీ తనిఖీలపై ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన బంధువులు, అనుచరుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ దాడులు జరగలేదని అన్నారు. ఐటీ అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. రైస్ మిల్లర్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. వారితో ఎలాంటి లావాదేవీలు లేవని పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. అదేవిధంగా తనకు ఎలాంటి కంపెనీలు లేవని.. తన దగ్గర డబ్బులు కూడా లేవని.. ఎక్కడైనా చూపిస్తే మీకే ఇచ్చేస్తానని ఎమ్మెల్యే భాస్కర్ రావు స్పష్టం చేశారు.
IT Raids on Congress Leaders Houses : ఇటీవలే పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం.. ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై మూకుమ్మడిగా సోదాలు చేపట్టారు. తదుపరి విచారణ కోసం హైదరాబాద్ రావాలని.. పొంగులేటి కుటుంబీకులకు ఐటీ అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఆదాయ ఐటీ అధికారులు సోదాలు (IT Raids in Telangana) నిర్వహించారు. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగపేట్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి (Parijatha Narsimha Reddy) ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం