High Court on Raja Singh case: రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. రాజాసింగ్‌పై నమోదైన కేసులో ఇప్పటివరకు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి కారణం చెప్పాలని మరోసారి సర్కారును ధర్మాసనం ఆదేశించింది. వచ్చే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఆర్డర్ ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, పీడీ యాక్ట్ కింద చర్లపల్లికి తరలింపు
రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం
మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
గుజరాత్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం.. మహారాష్ట్ర, కేరళలోనూ..