వీసీలు తమ యూనివర్సిటీల్లో నాణ్యమైన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు పెంపొందించే విధంగా కృషి చేయాలని గవర్నర్ తమిళిసై ( Governor Tamilisai Soundararajan) సూచించారు. విశ్వవిద్యాలయాలు అకాడమిక్, పరిశోధన రంగాలలో కృషిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు.
ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తితో మన దేశం సైన్స్ టెక్నాలజీ, వైద్య రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు.. గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కవిత, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేష్లు గవర్నర్‌ను కలిశారు.
Fake seeds: నకిలీ విత్తనాల బెడద.. విచ్చలవిడిగా మార్కెట్లోకి..