ETV Bharat / state

చేప పిల్లల టెండర్లను వెంటనే రద్దు చేయాలి: మత్స్యకార సంఘం

హైదరాబాద్ ముషీరాబాద్ పరిధి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల టెండర్లపై సమావేశం నిర్వహించారు. మత్స్యకారులకు ప్రభుత్వ ఫలాల అందాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ టెండర్లను రద్దు చేసి..నేరుగా సొసైటీలకే నిధులు విడుదల చేయాలని సంఘం తీర్మానం చేసింది.

author img

By

Published : Jun 13, 2020, 9:19 PM IST

సొసైటీలకే నగదు బదిలీ చేయాలి : మత్లస
సొసైటీలకే నగదు బదిలీ చేయాలి : మత్లస

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారని మత్సకార సంఘం గుర్తు చేసింది. దీన్నే అవకాశంగా తీసుకున్న కొంతమంది మత్స్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉచిత చేప పిల్లలను సొసైటీలకు కాకుండా దళారులకు అందేలా ప్రొత్సహిస్తున్నారని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

రూ. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా...

ప్రభుత్వం మత్స్యకారుల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోన్నా... ప్రభుత్వ ఫలాలు మాత్రం మత్స్యకారులకు చేరట్లేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లలకు బదులు ఆయా సొసైటీలకే నిధులు నేరుగా విడుదల చేయడం అన్ని విధాల శ్రేయస్కరమని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

నేరుగా ఖాతాల్లోకే బదిలీ చేయాలి...

మత్స్య సొసైటీ అకౌంట్లలోకే నేరుగా డబ్బులు బదిలీ చేయాలని...అప్పుడే నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు గూడబోయిన సాయిలు బెస్త అన్నారు. ఫలితంగా మత్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ నూతన విధానం ఆస్కారం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ కళ్ళు కప్పి నాణ్యతలేని చేప పిల్లలు చెరువుల్లో వేస్తున్నారని.. ఫలితంగా చేప పిల్లలు ఆశించిన మేర ఎదగకపోవడం వల్ల మత్స్యకార సొసైటీలు ఎంతో నష్టపోతున్నాయని సాయిలు ఆందోళన వ్యక్తం చేశారు.

చేతులు దులుపుకుంటున్న మత్స్యశాఖ...

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో అధిక శాతం మేర.. లక్ష చేప పిల్లల కొనుగోలుకు టెండర్లు పిలుస్తూ... పదివేల చేప పిల్లలు మాత్రమే వేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మత్స్యకారులకు నష్టం చేస్తోన్న శాఖాధికారులపై చర్యలు తీసుకొని దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

టెండర్లకు బదులు నిధులు..

ఈ క్రమంలో చేపలనే నమ్ముకుని జీవిస్తున్న మత్స్య సొసైటీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జూన్ నెలలోనే నిర్వహించనున్న ఉచిత చేప పిల్లల టెండర్లను వెంటనే రద్దు చేసి మత్స్యకారులను ఆదుకోవాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ బెస్త డిమాండ్ చేశారు. నిధులు సొసైటీ ఖాతాల్లోనే జమచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం నేరవేరాలంటే చేప పిల్లల టెండర్లను రద్దు చేయాలని సభ్యులు కోరారు. కార్యక్రమంలో దైవాధీనం బెస్త , మాదరబోయిన నర్సయ్య బెస్త , పూర్ణ చందర్ , సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : జిల్లాకోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.