కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు వ్యాక్సినేషన్లో (vaccination) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan)ఆరోపించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా సోనియా గాంధీ (Soniya Gandhi) పిలుపు మేరకు... గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో... నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని... కానీ ప్రధాని మోదీ మూర్ఖత్వం వల్ల వ్యాక్సిన్ సెంటర్లు మూసివేసే ప్రమాదం ఏర్పడిందని శ్రవణ్ విమర్శించారు.
మిగతా వారికి ఎప్పుడు..?
130కోట్ల దేశ జనాభాలో కేవలం 30కోట్లు మాత్రమే వ్యాక్సినేషన్ చేశారని... మిగతా వంద కోట్ల జనాభాకు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బ్లాక్ ఫగస్, మూడో, నాలుగో విడతలు వస్తున్నాయన్న నేపథ్యంలో... వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యాక్సిన్ ధరల విషయంలో కూడా దేశ, రాష్ట్ర, ప్రవేటు ఆసుపత్రుల్లో ఒకొక్క ధరలు నిర్ణయీస్తూ... కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్‌ని పూర్తిగా అమలు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: KTR: కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ ఆలస్యం: కేటీఆర్