ETV Bharat / state

రజక వృత్తిదార్లకు ఉపాధి చూపండి: చాడ వెంకట్​రెడ్డి

ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లో.. తెలంగాణ రజక వృత్తిదారుల సమాఖ్య ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : Jan 5, 2021, 6:49 PM IST

Cpi demanded that the government show alternative financial employment to the dhobis
రజక వృత్తిదార్లకు ఉపాధి చూపండి: చాడ వెంకట్​రెడ్డి

ప్రభుత్వం రజక వృత్తిదార్లకు ప్రత్యామ్నాయ ఆర్థిక ఉపాధిని చూపాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. వృత్తినే నమ్ముకొని చాలిచాలని ఆదాయంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న వారిని ఆదుకోవాలన్నారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని మఖ్దుమ్ భవన్​లో.. తెలంగాణ రజక వృత్తిదారుల సమైఖ్య ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్​ను​ ఆవిష్కరించారు.

రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు కావొస్తున్నా.. తెరాస నిర్లక్ష్యం కారణంగా రజక వృత్తిదారుల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల మీద ప్రభుత్వం అధ్యయనం చేయవలసిన అవసరముందన్నారు.

ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చాడ కోరారు. వాషెర్ మాన్ ఫెడరేషన్ నూతన బోర్డును ఏర్పాటు చేసి, జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రజకుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.