ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ నేతల ఘనస్వాగతం - Rythu Sangharshana Sabha

rahul gandhi reached hyderabad: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు.

CONGRESS LEADER RAHUL GANDHI REACHED HYDERABAD
హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌.. ఘనంగా స్వాగతం పలికి కాంగ్రెస్‌ నేతలు
author img

By

Published : May 6, 2022, 5:00 PM IST

Updated : May 6, 2022, 6:53 PM IST

rahul gandhi reached hyderabad: శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కాసేపట్లో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రాహుల్‌ గాంధీ వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో హనుమకొండకు బయల్దేరనున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ నేతల ఘనస్వాగతం

రాబోయే ఐదేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుందో వివరిస్తామని పీసీసీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తెలంగాణకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో వరంగల్ సభ కూడా అంతే సంతోషాన్ని ఇవ్వబోతుందని వెల్లడించారు. నూతన వ్యవసాయ విధానాన్ని వరంగల్ వేదికగా ఆవిష్కరించబోతున్నామన్నారు. రాహుల్ గాంధీకి ఓయూలోకి అనుమతి ఇవ్వకుండా కొందరు ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం తపిస్తే అధికారం కోల్పోవడం ఖాయమన్నారు.

హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌ గాంధీ.. ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ నేతలు

''జైళ్లో ఉన్న వారిని కలుసుకోవడం విధానపరమైన నిర్ణయం. చచ్చేముందు తెరాస నాయకులు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో 70 శాతం రైతులకు సంబంధించింది వరంగల్ సభ. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిగా ఈ సభను ఏర్పాటు చేశాం. రైతుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ఉక్కు సంకల్పంతో ఇచ్చిన రాష్ట్రం.. కోతుల గుంపులో చిక్కుకుంది.'' - రేవంత్‌రెడ్డి

''తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏ పౌరుడైనా వెళ్లొచ్చు. రాహుల్‌గాంధీని అడ్డుకోవటం సమంజసం కాదు. రాహుల్‌గాంధీకి దేశమంతా తిరిగే హక్కుంది. విక్రమార్క ఒక ఎంపీ వర్సిటీలోకి వెళ్లొద్దని అంటున్నారంటే అర్థమేంటి?. వర్సిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అర్థం. రాహుల్‌గాంధీని ఓయూకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం.'' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇప్పటికే హనుమకొండలో రాహుల్ గాందీ రైతు సంఘర్షణ సభకు సర్వం సిద్ధం చేశారు. ఈ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనుంది. అక్కడి మైదానం ఫ్లెక్సీలు, కాంగ్రెస్‌ జెండాలతో ముస్తాబు అయింది. రాహుల్ పర్యటన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

rahul gandhi telangana tour
పార్టీ నేతలతో ముచ్చటిస్తున్న రాహుల్​ గాంధీ

ప్రధాన వేదికకు ఒకవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబసభ్యుల కోసం ఓ వేదిక, మరోవైపు కళాకారుల కోసం మరో వేదిక ఏర్పాటు చేసారు. వీఐపీల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.

సభ ముగిసిన అనంతరం వరంగల్‌ నుంచి రోడ్డుమార్గాన హైదరాబాద్‌ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు రాహుల్‌గాంధీ నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం రెండ్రోజుల పర్యటన ముగించుకుని... రాహుల్‌గాంధీ దిల్లీ బయలుదేరి వెళతారు.

ఇవీ చదవండి: రైతు సంఘర్షణ సభకు సర్వం సిద్ధం..

Last Updated : May 6, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.