ETV Bharat / state

CM KCR: ఓరుగల్లులో అత్యాధునిక మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన - multisuper specialty hospital in warangal update

ఓరుగల్లులో దేశంలోనే మెరుగైన అత్యాధునిక మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి.. ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆసుపత్రి నమూనా కోసం కెనడాలో పర్యటించాలని.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కరోనా తగ్గుముఖం పట్టడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. వ్యాక్సినేషన్‌ను ప్రస్తుత తరహాలోనే కొనసాగించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులను అరికట్టేలా సంబంధిత శాఖలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్న అధికారులు.. మూడేళ్లు ఇలాగే కష్టపడితే శ్రీలంక తరహాలో మలేరియా రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు.

ఓరుగల్లులో అత్యాధునిక మల్టీసూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి శంకుస్థాపన

author img

By

Published : Jun 14, 2021, 6:42 AM IST

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా.. వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. వరంగల్‌లోని కేంద్ర కారాగారం స్థానంలో.. దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని.. ఈ నెల 21న ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో.. హరితభవనంగా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. అత్యవసర చికిత్సకు వచ్చే రోగుల కోసం ఆసుపత్రి భవనంపైనే.. హెలికాప్టర్ దిగేలా హెలిపాడ్ నిర్మించాలని అన్నారు. కెనడా నమూనాలో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్ వెంటిలేషన్ పద్ధతిలో ఆసుపత్రిని నిర్మించాలన్న కేసీఆర్.. ఇందుకోసం కెనడాలో పర్యటించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా.. వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగు పరుస్తామని సీఎం తెలిపారు. కరోనాకు అందుతున్న వైద్యం , నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా తగ్గుముఖం పడుతుండడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు హైరిస్కు గ్రూపులను గుర్తించి వాక్సినేషన్ అందించడం ద్వారా.. గణనీయంగా వ్యాప్తిని అరికట్టగలిగామని సమావేశం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ ఉండాలని...సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మరో మూడేళ్లు కష్టపడితే..

సీజనల్ వ్యాధులపైనా సమావేశంలో చర్చించారు. మలేరియా, తదితర సీజనల్ వ్యాధుల కట్టడిలో... దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వైరల్, సీజనల్ వ్యాధులను గణనీయంగా అరికట్టగలిగామని వివరించారు. మలేరియాలో ప్రీఎలిమినేషన్ దశ నుంచి... ఎలిమినేషన్ దశకు చేరుకున్నామన్న అధికారులు.. మరో మూడేళ్లు ఇదే తరహాలో కష్టపడితే శ్రీలంక తరహాలో మలేరియా రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితులకు దోహదపడిన పంచాయతీరాజ్, పురపాలకశాఖలను కరతాళధ్వనుల ద్వారా సమావేశం అభినందించింది.

అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి..

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నాయన్న సీఎం కేసీఆర్.. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే వైద్యారోగ్య, పంచాయతీరాజ్, పురపాలకశాఖల అధికారులు వ్యాధులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విధానాన్ని ఒక పని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలని.. ప్రజారోగ్యం విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. జిల్లా, మండల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యాధులు ప్రబలాక... మందుల డబ్బాలు చేతిలో పట్టుకొని తిరిగి పరేషాన్ కాకుండా.. సీజన్ ప్రారంభానికి ముందే.... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమమని అన్నారు. తద్వారా వైరల్, సీజనల్ వ్యాధులను... ముందస్తుగానే అరికట్టవచ్చని సీఎం తెలిపారు. అధికారులకు వైద్య, ఆరోగ్యశాఖ నుంచి.... సీజనల్ వ్యాధుల చార్టును అందించారు.

కేసీఆర్ కిట్ వల్ల మంచి ఫలితాలు..

రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి అభినందించారు. కేసీఆర్ కిట్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్న సీఎం.. కిట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 29 నుంచి 55 శాతానికి పెరిగాయని చెప్పారు.

ఇదీ చూడండి: అదనపు కలెక్టర్లకు కియా కార్లు అందించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.