TS Govt Presents CAG Report in Assembly : రాష్ట్రంలో పెరుగుతున్న జీఎస్డీపీ శాతానికి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ అభిప్రాయపడింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. అప్రోప్రియేషన్ అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదికలను శాసనసభ, మండలిలో ఉంచారు. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రాంట్లకు సంబంధించి రూ.75 వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందన్న కాగ్... ఆర్థిక, నీటిపారుదల, వైద్య-ఆరోగ్యం పంచాయతీరాజ్ శాఖల కేటాయింపులకు మించి 34 శాతం ఖర్చు అయ్యాయని పేర్కొంది.
Telangana Assembly Sessions 2023 : గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేశారని వివరించింది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 259 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాటు 22,669 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్ళిందని పేర్కొంది. 2018-19లో ఉన్న రెవెన్యూ మిగులుతో ఉన్న రాష్ట్రం 2020-21 నాటికి 9,335 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందన్న కాగ్... రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వరకు ఉద్యోగుల వేతనాలు, వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని వివరించింది.
జీఎస్డీపీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదు : 2021-22 వరకు రాష్ట్ర రుణాలు 3,14,662 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తం జీఎస్డీపీలో అప్పు 27.40 శాతంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వివరించింది. 2021-22 లో పన్ను ఆదాయం 37శాతం, పన్నేతర ఆదాయం 45 శాతం పెరిగిందని... ఇదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మాత్రం 44 శాతం తగ్గినట్లు చెప్పింది. 2021-22 లో తీసుకున్న 46,994 కోట్ల రూపాయల రుణాల్లో 28,883 కోట్లను పెట్టుబడి వ్యయం కోసం వినియోగించారని... రుణాల ద్వారా సమీకరించుకున్న మొత్తాన్ని కూడా అప్పులు, వడ్డీ చెల్లింపుల కోసం వినియోగించుకున్నారని కాగ్ పేర్కొంది.
Five Bills Passed in Telangana Assembly : ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ
శాసన మండలిలో పలు బిల్లులకు ఆమోదం : శనివారం ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ ఐదు బిల్లులకు ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. టిమ్స్ బిల్లుతో పాటు కర్మాగారాలు, మైనార్టీ కమిషన్, జీఎస్టీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను నిన్న శాసనసభ ఆమోదించింది. అక్కడ ఆమోదం పొందిన బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రవేశపెట్టగా వాటిలో టీమ్స్ బిల్లు, వస్తు, సేవల పన్ను బిల్లు, మైనార్టీ కమిషన్ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయితీరాజ్ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.
Governor Tamilisai on TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై చర్చించేందుకు రవాణా శాఖ అధికారులతో గవర్నర్ భేటీ
Excitement over TSRTC Bill : ఆమోదిస్తారా..? ఆపుతారా..? ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ